రానా.. ఇక శాశ్వతంగా లాక్డ్-డౌన్: అక్షయ్ కుమార్

ABN , First Publish Date - 2020-08-08T22:20:51+05:30 IST

టాలీవుడ్ యంగ్ హీరో రానా మరికొద్ది సేపట్లో తన బ్యాచిలర్ జీవితానికి శుభం కార్డు వేయనున్నాడు.

రానా.. ఇక శాశ్వతంగా లాక్డ్-డౌన్: అక్షయ్ కుమార్

టాలీవుడ్ యంగ్ హీరో రానా మరికొద్ది సేపట్లో తన బ్యాచిలర్ జీవితానికి శుభం కార్డు వేయనున్నాడు. తను ప్రేమించిన మిహికా బజాజ్‌తో ఈ రోజు (శనివారం) రాత్రి 8:30 గంటలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ వివాహ వేడుక జరుగబోతోంది. 


ప్రభుత్వ నిబంధనల కారణంగా అతి తక్కువ మంది అతిథులు మాత్రమే ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. దీంతో రానా స్నేహితులు, సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ ట్విటర్ ద్వారా రానాకు విషెస్ తెలియజేశాడు. `శాశ్వతంగా లాక్డ్-డౌన్ కావడానికి ఇదే సరైన మార్గం. కంగ్రాట్స్ రానా.. మీరిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాన`ని అక్షయ్ ట్వీట్ చేశారు. 
Updated Date - 2020-08-08T22:20:51+05:30 IST

Read more