షూటింగ్‌లో పాల్గొన్న అక్ష‌య్‌

ABN , First Publish Date - 2020-05-26T14:20:19+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ మాత్రం షూటింగ్‌లో పాల్గొన్నారు. ప‌రిమిత సంఖ్య‌లోని యూనిట్ స‌భ్యులతో పాటు అక్ష‌య్‌పై కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు.

షూటింగ్‌లో పాల్గొన్న అక్ష‌య్‌

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. దాదాపు రెండు నెల‌ల త‌ర్వాత ప్ర‌భుత్వం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేసుకోవ‌డానికి అనుమ‌తినిచ్చింది. షూటింగ్స్‌కు ఇంకా ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ మాత్రం షూటింగ్‌లో పాల్గొన్నారు. ప‌రిమిత సంఖ్య‌లోని యూనిట్ స‌భ్యులతో పాటు అక్ష‌య్‌పై కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. అయితే అది సినిమాకు కాదండోయ్‌. ఓ ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న కోసం. ఈ విష‌యంపై ఫెడ‌రేష‌న్ ఆఫ్ వెస్ట్ర‌న్ ఇండియా ఆఫ్ సినీ ఎంప్లాయిస్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ అశోక్ దుబే మాట్లాడుతూ ‘‘ఇదొక ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌. పోలీస్ క‌మీష‌న‌ర్ అనుమ‌తి త‌ర్వాత యూనిట్ మ‌మ్మ‌ల్ని సంప్ర‌దించింది. ప‌లు జాగ్ర‌త్త‌లు సూచించి షూటింగ్ చేయాల‌ని సూచించాం. లాక్ డౌన్ త‌ర్వాత అనుస‌రించాల్సిన విధి విధానాల‌పై చిత్రీక‌ర‌ణ జ‌రిగింది’’ అన్నారు. 

Updated Date - 2020-05-26T14:20:19+05:30 IST