కపిల్‌కు నా కంటే పెద్ద ఇల్లుంది: అక్షయ్

ABN , First Publish Date - 2020-10-30T17:30:20+05:30 IST

అక్షయ్ కుమార్.. బాలీవుడ్‌లో బడా హీరో.

కపిల్‌కు నా కంటే పెద్ద ఇల్లుంది: అక్షయ్

అక్షయ్ కుమార్.. బాలీవుడ్‌లో బడా హీరో. విరామం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ, అత్యధిక పారితోషికం అందుకుంటూ భారీ సంపాదన ఆర్జిస్తున్న కథానాయకుడు. అయితే అక్షయ్ కంటే టీవీ హోస్ట్ కపిల్ శర్మ మరింత ఎక్కువ సంపాదిస్తున్నాడట. ఈ విషయాన్ని తాజాగా అక్షయ్ వెల్లడించాడు. తమ కొత్త సినిమా `లక్ష్మి` ప్రమోషన్ కోసం తాజాగా `ది కపిల్ శర్మ కామెడీ షో`కు అక్షయ్, కియార హాజరయ్యారు. 


అక్షయ్ సంవత్సరంలోని 365 రోజులూ అత్యంత బిజీగా ఉండే హీరో అని, తను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఓ ప్రోడక్ట్‌ను కూడా ఇటీవల అక్షయ్ లాగేసుకున్నాడని కపిల్ పేర్కొన్నాడు. దీనికి స్పందించిన అక్షయ్.. `కపిల్ గతంలో ఎండార్స్ చేసిన ఓ బ్రాండ్ ఇప్పుడు నా చేతికి వచ్చింది. ఏదేమైనా ఈ షో ద్వారా కపిల్ సంపాదిస్తున్నంతగా వేరెవరూ సంపాదించలేరు. గతంలో ఒక రోజు కపిల్ ఇంటికి వెళ్లా. ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోయా. నా ఇల్లు కూడా అంత పెద్దగా లేద`ని అక్షయ్ వ్యాఖ్యానించాడు. 

Updated Date - 2020-10-30T17:30:20+05:30 IST