సీఎంను కలిసిన అక్షయ్‌కుమార్‌

ABN , First Publish Date - 2020-12-02T18:10:09+05:30 IST

రెండు రోజుల పర్యటన నిమిత్తం ముంబై చేరుకున్న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ప్రత్యేకంగా కలిశారు.

సీఎంను కలిసిన అక్షయ్‌కుమార్‌

రెండు రోజుల పర్యటన నిమిత్తం ముంబై చేరుకున్న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ప్రత్యేకంగా కలిశారు. లక్నో మున్సిపల్‌ బాండ్స్‌ లాంఛ్‌ కార్యక్రమంలో హాజరు కావడానికి యోగి ముంబై వచ్చారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక వేత్తలతోనూ ఆయన ప్రత్యేక భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్‌, అక్షయ్‌ కుమార్‌ కలయికకు ప్రాధాన్యత సంతరించుకుంది. అక్షయ్‌ తన తదుపరి చిత్రం రామ్‌సేతు గురించి యోగితో చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటు చేయబోయే ఫిలింసిటీ గురించి చర్చించేందుకు బాలీవుడ్‌ చిత్ర నిర్మాతల బృందాన్ని కూడా యోగి ఆదిత్యనాథ్‌ కలవనున్నారు. ఈ నిర్మాతల బృందంలో సుభాష్‌ ఘయ్‌, రాజ్‌కుమార్ సంతోషి, బోనీ కపూర్‌, మధుర్‌ బండార్కర్‌, భూషణ్‌ కుమార్‌, జయంతిలాల్‌ గడా, సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌ తదితరులున్నారు. 


Updated Date - 2020-12-02T18:10:09+05:30 IST