సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

దేశంలో అత్యంత ఖరీదైన కార్ల కలెక్షన్ గల హీరో అతనే!

ABN, First Publish Date - 2020-09-09T16:08:05+05:30

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈరోజు(సెప్టెంబరు 9)న తన 53వ పుట్టినరోజు చేసుకుంటున్నారు. 1967, సెప్టెంబరు 9న అక్షయ్ జన్మించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈరోజు(సెప్టెంబరు 9)న తన 53వ పుట్టినరోజు చేసుకుంటున్నారు. 1967, సెప్టెంబరు 9న అక్షయ్ జన్మించారు. అక్షయ్ తన కెరియర్‌లో పలు విజయవంతమైన చిత్రాలను అందించారు. బాలీవుడ్‌లో యాక్షన్ హీరోగా గుర్తింపు పొందారు. అక్షయ్ కు లగ్జరీ కార్లంటే ఎంతో ఇష్టం. అతని దగ్గర అత్యంత ఖరీదైన కార్ల కలెక్షన్ ఉంది. ఇటీవలే అక్షయ్ మెర్సిడీజ్ బెంజ్ వి- క్లాస్ కారును కొనుగోలు చేశారు. ఈ కారు ధర భారత్‌లో రూ. 1.10 కోట్లు. ఈ కారుకు స్టయిలిష్ డోర్లుతో పాలు పలు లగ్జరీ ఫీచర్లు కూడా ఉన్నాయి. 



అక్షయ్ దగ్గరున్న మరో కారు మెర్సిడీజ్ జీఎల్ఎస్. దీని ధర రూ. 85.67 లక్షలు. ఈ హీరో దగ్గరున్న మరో ఖరీదైన కారు పోర్స్చే కయెన్. ఈ కారు ధర రూ. 1.19 కోట్లు నుంచి 1.92 కోట్ల మధ్య ఉంటుంది. ఖరీదైన రేంజ్ రోవర్ వోగు కారు కూడా అక్షయ్ కుమార్ దగ్గరుంది. దీని ధర భారత్‌లో రూ. 2.18 కోట్లు. రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు కూడా అక్షయ్ దగ్గరుంది. 

Updated Date - 2020-09-09T16:08:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!