సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

థియేటర్లలో ఆ అగ్రహీరో సినిమా విడుదల... కానీ మనం చూడలేం!

ABN, First Publish Date - 2020-10-01T13:13:01+05:30

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘లక్ష్మీ బాంబ్’ సినిమాపై ప్రేక్షకుల్లో చాలా అంచనాలున్నాయి. ఈ సినిమాను థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయాలని భావించారు. అయితే కరోనా కారణంగా ఓటీటీ ప్లాట్‌ఫారంపై విడుదల చేస్తున్నారు. ఈ సినిమా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘లక్ష్మీ బాంబ్’ సినిమాపై ప్రేక్షకుల్లో చాలా అంచనాలున్నాయి. ఈ సినిమాను థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయాలని భావించారు. అయితే కరోనా కారణంగా ఓటీటీ ప్లాట్‌ఫారంపై విడుదల చేస్తున్నారు. ఈ సినిమా చూసేందుకు అక్షయ్ ఫ్యాన్స్ తహతహలాడిపోతున్నారు. అయితే ఈ సినిమా భారత్‌లోని థియేటర్లలో విడుదల కాకపోయినా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూఏఈ తదితర దేశాలలో వెండితెరపై విడుదల కానుంది. 



నవంబరు 9న ‘లక్ష్మీ బాంబ్’ సినిమా ఈ దేశాలలోని థియేటర్లలో విడుదల కానుంది. ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా అదేరోజున ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ‘లక్ష్మీబాంబ్’ సినిమాలో అక్షయ్ కుమార్ హిజ్రాగా కనిపించనున్నారు. దీనికిముందు కూడా అక్షయ్ ఇటువంటి పాత్రలు చేశారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, తుషార్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - 2020-10-01T13:13:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!