వ‌ర‌ద బాధితుల‌కు అక్ష‌య్ రూ. కోటి విరాళం

ABN , First Publish Date - 2020-08-19T16:32:55+05:30 IST

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రకృతి వైపరీత్యాలు, ఇత‌ర‌త్రా విప‌త్తులు ఏర్ప‌డిన‌పుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇటీవలి...

వ‌ర‌ద బాధితుల‌కు అక్ష‌య్ రూ. కోటి విరాళం

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రకృతి వైపరీత్యాలు, ఇత‌ర‌త్రా విప‌త్తులు ఏర్ప‌డిన‌పుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇటీవలి కరోనా వైరస్ లాక్‌డౌన్ సమయంలో అక్ష‌య్ పీఎం కేర్ ఫండ్‌కు నిధులు అందించ‌డ‌మే కాకుండా, కరోనా వారియర్స్‌తో సహా పేదల‌కు వివిధ మార్గాల‌లో సహాయం అందించారు. ఇప్పుడు అసోం వ‌ర‌ద బాధితుల‌కు సహాయం చేయడానికి అక్ష‌య్ రూ. కోటి విరాళం ప్ర‌క‌టించారు. ఈ నేప‌ధ్యంలో అసోం సీఎం సర్బానంద సోనోవాల్ అక్షయ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకుముందు అక్ష‌య్‌ బీహార్ వరద బాధితుల సహాయ నిధికి రూ. కోటి విరాళం అందించారు. 

Updated Date - 2020-08-19T16:32:55+05:30 IST