అఖిల్‌, పూజా కెమిస్ట్రీ

ABN , First Publish Date - 2020-11-14T05:15:42+05:30 IST

‘మీ మ్యారేజ్‌ లైఫ్‌ నుంచి మీరేమి ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు’ అని అడుగుతూ మొదటి టీజర్‌తో ఆకట్టుకున్న అఖిల్‌ అక్కినేని దీపావళికి పూజాహెగ్డేతో చిచ్చుబుడ్డి వెలిగిస్తూ సందడి చేశారు. ఆయన నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’....

అఖిల్‌, పూజా కెమిస్ట్రీ

‘మీ మ్యారేజ్‌ లైఫ్‌ నుంచి మీరేమి ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు’ అని అడుగుతూ మొదటి టీజర్‌తో ఆకట్టుకున్న అఖిల్‌ అక్కినేని దీపావళికి పూజాహెగ్డేతో చిచ్చుబుడ్డి వెలిగిస్తూ సందడి చేశారు. ఆయన నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్శతో నిర్మిస్తున్న చిత్రమిది. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకుడు. దీపావళి శుభాకాంక్షలు చెబుతూ చిత్ర యూనిట్‌ కొత్త పోస్టర్‌ విడుదల చేసింది. ఈ చిత్రంలో అఖిల్‌, పూజాహెగ్డే మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో పోస్టర్‌ చూస్తుంటే తెలుస్తుంది. రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2020-11-14T05:15:42+05:30 IST