లాక్‌డౌన్‌ తర్వాతే ‘ఆకాశం నీ హ‌ద్దు’ రిలీజ్‌

ABN , First Publish Date - 2020-08-14T18:27:46+05:30 IST

సుధా కొంగర దర్శకత్వంలో యువనటుడు సూర్య, అపర్ణా బాలమురళి జంటగా నటిస్తోన్న చిత్రం ‘శూరరై పోట్రు’. తెలుగులో ఈ చిత్రం ‘ఆకాశం నీ హ‌ద్దురా’ పేరుతో విడుద‌ల‌వుతుంది.

లాక్‌డౌన్‌ తర్వాతే ‘ఆకాశం నీ హ‌ద్దు’ రిలీజ్‌

సుధా కొంగర దర్శకత్వంలో యువనటుడు సూర్య, అపర్ణా బాలమురళి జంటగా నటిస్తోన్న చిత్రం ‘శూరరై పోట్రు’. తెలుగులో ఈ చిత్రం ‘ఆకాశం నీ హ‌ద్దురా’ పేరుతో విడుద‌ల‌వుతుంది. నిజానికి ఏప్రిల్‌లో విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఆ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రసార మాధ్యమాల్లో వార్తలు వినిపించాయి. అంతే కాకుండా ఆ చిత్రం సెన్సార్‌కు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. ఆ చిత్రం నిడివి 153 నిమిషాలని, సెన్సార్‌ బోర్డు అభ్యంతరాలతో తొలగించిన డైలాగులు, సన్నివేశాలకు సంబంధించిన వివరాలు వెలు వడ్డాయి. దీంతో ఆ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నారని పుకార్లు వ్యాపించాయి. ఈ పుకార్లకు సుధా కొంగర పుల్‌స్టాప్‌ పెట్టారు. సెన్సార్‌ బోర్డు తనిఖీ పూర్తయి ఆ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉందని, ఎట్టి పరిస్థితులలో ఓటీటీలో విడుదల చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ తర్వాత చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తామని వివరించారు.

Updated Date - 2020-08-14T18:27:46+05:30 IST