కరోనాకు చెక్ పెట్టేందుకు అజిత్‌ సలహా

ABN , First Publish Date - 2020-06-28T14:34:59+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు డ్రోన్ల ద్వారా క్రిమినాశని పిచికారీ చేయాలని తమిళ సినీనటుడు అజిత్‌ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. చెన్నై నగరం కరోనా రెడ్‌జోన్‌గా మారుతుండటం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనాకు చెక్ పెట్టేందుకు అజిత్‌ సలహా

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు డ్రోన్ల ద్వారా క్రిమినాశని పిచికారీ చేయాలని తమిళ సినీనటుడు అజిత్‌ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. చెన్నై నగరం కరోనా రెడ్‌జోన్‌గా మారుతుండటం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా తాకిడి ప్రాంతాల్లో ముమ్మరంగా క్రిమినాశని పిచికారీ చేస్తే ఆ వైరస్‌ వ్యాప్తిని నిరోధించవచ్చునని అభిప్రాయపడ్డారు. అజిత్‌ నేతృత్వంలో ఐఐటీ మద్రాసులోని ‘తక్ష’ అనే బృందం నవీన సాంకేతిక పద్ధతులతో డ్రోన్లను రూపొందిస్తోంది. జాతీయస్థాయిలో ఆ డ్రోన్లు పలు పోటీల్లో పాల్గొని బహుమతులు కూడా గెలుచుకున్నాయి. ఆస్ర్టేలియాలోనూ అజిత్‌ బృందం తయారు చేసిన డ్రోన్ల సామర్థ్యానికి బహుమతులు లభించాయి. ఈ సందర్భంగా అజిత్‌ మాట్లాడుతూ... తాము రూపొందించిన డ్రోన్ల ద్వారా అరగంటలో 16లీటర్ల క్రిమినాశనిని పిచికారీ చేయవచ్చునని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య కార్మికులకు బదులుగా తమ బృందం రూపొందించిన డ్రోన్లతో క్రిమినాశని చల్లితే కరోనాను కట్టడి చేయవచ్చునని తెలిపారు. అజిత్‌ చెప్పిన ఈ సలహా పట్ల ఆయన అభిమానులు హర్షం ప్రకటించారు.

Updated Date - 2020-06-28T14:34:59+05:30 IST