అజిత్ హైదరాబాద్‌లో...
ABN , First Publish Date - 2020-10-25T05:45:34+05:30 IST
తమిళనటుడు అజిత్ ఈ ఆదివారం నుంచి రామోజీ ఫిలింసిటీలో జరిగే ‘వాలిమైయ్’ షూటింగులో పాల్గోనున్నారు. అజిత్‌కు ఇది 60వ చిత్రం...

తమిళనటుడు అజిత్ ఈ ఆదివారం నుంచి రామోజీ ఫిలింసిటీలో జరిగే ‘వాలిమైయ్’ షూటింగులో పాల్గోనున్నారు. అజిత్‌కు ఇది 60వ చిత్రం. ఇందులో ఆయన పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ విలన్‌పాత్రలో నటిస్తున్నారు. జాన్వీకపూర్, హ్యూమాఖురేషీలు కథానాయికలు. హైదరాబాద్‌లో కొన్ని వారాల పాటు జరిగే షూటింగులో అజిత్, హ్యూమా ఖురేషీలపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారు. క్లైమాక్స్ సన్నివేశాల కోసం ఫిలింసిటీలో పెద్ద సెట్ నిర్మించి షూటింగు జరుపుతారని సమాచారం. హెచ్ వినోద్ దర్శకత్వంలో బోనీకపూర్ నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు.
Read more