ఫ్రీగా చేస్తున్నారట!

ABN , First Publish Date - 2020-02-08T05:29:11+05:30 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో హిందీ హీరో అజయ్‌ దేవగణ్‌ అతిథి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల వికారాబాద్‌ అడవుల్లో ఆయన పాల్గొనగా... ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను...

ఫ్రీగా చేస్తున్నారట!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో హిందీ హీరో అజయ్‌ దేవగణ్‌ అతిథి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల వికారాబాద్‌ అడవుల్లో ఆయన పాల్గొనగా... ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. హిందీ చిత్రసీమ సమాచారం ప్రకారం... ఈ సినిమాకు అజయ్‌ దేవగణ్‌ డబ్బులు తీసుకోవడం లేదట! దర్శకుడు రాజమౌళితో స్నేహం కారణంగా ఫ్రీగా చేస్తున్నారట! ‘ఈగ’ హిందీ వెర్షన్‌కు ఆయన వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. అప్పట్నుంచి రాజమౌళి, అజయ్‌ దేవగణ్‌ మధ్య మంచి స్నేహం ఉంది. అందుకని, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అతిథి పాత్ర చేయమని అడగ్గానే అంగీకరించారు. హిందీలో అజయ్‌ దేవగణ్‌కు మంచి మార్కెట్‌ ఉంది. అందుకు తగ్గట్టు నిర్మాత డీవీవీ దానయ్య పారితోషికం ఇవ్వబోగా... సున్నితంగా తిరస్కరించారట. తెలుగులో అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్న తొలి చిత్రమిది. ఆయనకు జోడీగా శ్రియ కనిపించనున్నారు. చిన్న ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా... ఒలీవియా మోరిస్‌, అలియా భట్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.


Updated Date - 2020-02-08T05:29:11+05:30 IST