నో వర్రీ.. నో హర్రీ.. - అజయ్‌ దేవగణ్‌

ABN , First Publish Date - 2020-10-14T06:21:03+05:30 IST

బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ హీరోగా, నిర్మాతగా, అతిథి పాత్రధారిగా ఏడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ‘భుజ్‌’ విడుదలకు సిద్ధం కాగా మిగిలిన చిత్రాల్లో....

నో వర్రీ.. నో హర్రీ.. - అజయ్‌ దేవగణ్‌

బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ హీరోగా, నిర్మాతగా, అతిథి పాత్రధారిగా ఏడు సినిమాలతో బిజీగా ఉన్నారు.  ఆయన నటించిన ‘భుజ్‌’ విడుదలకు సిద్ధం కాగా మిగిలిన చిత్రాల్లో కొన్ని ప్రీ ప్రొడక్షన్‌, మరి కొన్ని సగం చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. లాక్‌డౌన్‌ సడలింపుతో ఇప్పుడిప్పుడే చిత్రీకరణలు మొదలవుతున్నాయి. అయితే షూటింగ్‌లు ప్రారంభించడంలొ బాలీవుడ్‌ కాస్త స్లోగా ఉందనే చెప్పాలి. అందుకే అజయ్‌ దేవగణ్‌ కూడా చిత్రీకరణకు ఇప్పుడేమీ తొందర లేదని చెబుతున్నారు. కొవిడ్‌-19 ప్రభావం తగ్గి పరిస్థితులు కాస్త చక్కబడ్డాక ఆయన షూటింగ్‌లో పాల్గొంటారట. అప్పటి వరకూ షూటింగ్‌ విషయంలో నో వర్రీ.. నో హర్రీ.. అని అజయ్‌ అంటున్నారు. అయితే ఈ ఖాళీ సమయంలో కొత్త కథలు వింటున్నారు అజయ్‌ దేవగణ్‌. తను దర్శకత్వం వహించబోయే చిత్రానికి కథ రాసే పనితోపాటు ప్రొడక్షన్‌ పనులతోనూ బిజీగా ఉన్నారు. 

Updated Date - 2020-10-14T06:21:03+05:30 IST