మనోరమ బయోపిక్‌లోనటించాలని ఆశపడుతున్నా : ఐశ్వర్యా రాజేష్
ABN , First Publish Date - 2020-08-25T17:01:36+05:30 IST
దివంగత తమిళ హాస్యనటి మనోరమ బయోపిక్‌లో నటించి జాతీయ అవార్డు పొందాలని ఆశపడుతున్నానని అందాల భామ ఐశ్వర్యా రాజేష్ చెబుతోంది.

దివంగత తమిళ హాస్యనటి మనోరమ బయోపిక్‌లో నటించి జాతీయ అవార్డు పొందాలని ఆశపడుతున్నానని అందాల భామ ఐశ్వర్యా రాజేష్ చెబుతోంది. జాతీయ అవార్డు పొందిన తమిళ చిత్రం ‘కాక్కా ముట్టై’ చిత్రంలో ఇద్దరు చిన్నారులకు తల్లిగా నటించిన ఐశ్వర్యా రాజేష్ తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ చిత్రం తర్వాత ‘ధర్మదురై’, ‘వడ చెన్నై’, ‘సెక్క సివంద వానమ్’, ‘కనా’, ‘నమ్మవీట్టు పిళ్ళై’ తదితర చిత్రాల్లో నటించి మంచి నటిగా పేరుతెచ్చుకుంది. ప్రస్తుతం ‘భూమిక’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి రతీంద్రన్ ఆర్.ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీక్ సుబ్బురాజ్, సుదన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్ సైక్రియాటిస్టు పాత్రలో నటిస్తోంది. ‘భూమిక’ తనకు 25వ చిత్రమని, సైక్రియాటిస్టు పాత్రలో నటించడం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపింది. ఈ చిత్రం షూటింగ్ ఊటీలో నిర్విరామంగా 35 రోజులపాటు జరిగింది. ఇక ‘ఆచ్చి’ మనోరమ బయోపిక్‌లో మనోరమ పాత్రలో నటించి జాతీయ స్థాయిలో అవార్డు పొందాలని ఆశపడుతున్నానని, అది త్వరలో నెరవేరాలని కోరుకుంటున్నానని తెలిపింది.
Read more