భరతనాట్యం నేర్చుకుంటున్నఐశ్వ‌ర్యారాజేష్‌

ABN , First Publish Date - 2020-04-28T18:35:09+05:30 IST

ఎప్పుడూ సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండే సినీ తార‌లంద‌రూ ఇంటి ప‌ని, వంట ప‌ని చేయ‌డంతో పాటు కొత్త విష‌యాల‌ను నేర్చుకుంటున్నారు. అలాగే తాను కూడా వంట నేర్చుకుంటున్నాన‌ని, దీంతో పాటు భ‌ర‌త‌నాట్యం కూడా నేర్చుకుంటున్నాన‌ని తెలిపారు హీరోయిన్ ఐశ్వ‌ర్యా రాజేష్‌.

భరతనాట్యం నేర్చుకుంటున్నఐశ్వ‌ర్యారాజేష్‌

ఎప్పుడూ సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండే సినీ తార‌లంద‌రూ ఇంటి ప‌ని, వంట ప‌ని చేయ‌డంతో పాటు కొత్త విష‌యాల‌ను నేర్చుకుంటున్నారు. అలాగే తాను కూడా వంట నేర్చుకుంటున్నాన‌ని, దీంతో పాటు భ‌ర‌త‌నాట్యం కూడా నేర్చుకుంటున్నాన‌ని తెలిపారు హీరోయిన్ ఐశ్వ‌ర్యా రాజేష్‌. రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘‘మా అమ్మ‌గారు క్లాసిక‌ల్ డాన్స‌ర్‌. నేను క్లాసిక‌ల్ డాన్స్ నేర్చుకోలేద‌ని బాధ‌ప‌డుతుండేదాన్ని. హీర‌యిన్ అయిన త‌ర్వాత వ‌రుస సినిమాలు, ఎప్పుడైనా ఖాళీ దొరికితే స్నేహితులతో కాల‌క్షేపం చేయ‌డం, సినిమాలు చూడ‌టం చేసేదాన్ని. క్లాసిక‌ల్ డాన్స్ నేర్చుకోవ‌డానికి స‌మ‌యం దొరికేది కాదు. అయితే ఇప్పుడు కావాల్సినంత స‌మ‌యం దొరికింది. కొత్త స్క్రిప్ట్స్‌ను చ‌ద‌వ‌డంతో పాటు రెండు గంట‌ల పాటు స్కైప్‌లో శిక్ష‌ణ తీసుకుంటున్నాను’’ అని తెలిపారు. 

Updated Date - 2020-04-28T18:35:09+05:30 IST