ఐశ్వ‌ర్యా రాయ్‌, ఆరాధ్య‌కు క‌రోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-07-12T20:30:57+05:30 IST

లేటెస్ట్ స‌మాచారం మేర‌కు తాజా క‌రోనా టెస్టుల్లో అమితాబ్ కుటుంబంలో మ‌రో ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. వారెవ‌రో కాదు.. ఐశ్వ‌ర్యారాయ్ బ‌చ్చ‌న్‌, ఆరాధ్య‌.

ఐశ్వ‌ర్యా రాయ్‌, ఆరాధ్య‌కు క‌రోనా పాజిటివ్‌

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ ఆయ‌న త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్ శ‌నివారం సాయంత్రం కోవిడ్ పాజిటివ్ కార‌ణంగా హాస్పిట‌ల్‌లోజాయిన్ అయిన సంగ‌తి తెలిసిందే. జయబాదురి, ఐశ్వర్యారాయ్, ఆరాధ్య సహా ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌కు నెగ‌టివ్ అనే అందరూ అనుకున్నారు. అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు తాజా క‌రోనా టెస్టుల్లో అమితాబ్ కుటుంబంలో మ‌రో ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. వారెవ‌రో కాదు.. ఐశ్వ‌ర్యారాయ్ బ‌చ్చ‌న్‌, ఆరాధ్య‌. ఇప్పుడు వీరిద్ద‌రూ కూడా నానావ‌తి హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యార‌ట‌. మిగిలిన కుటుంబ స‌భ్యులు జ‌య‌బాదురి, ఆగ‌స్య నందా, న‌వ్య ల‌కు నెగ‌టివ్ టెస్ట్ రిపోర్ట్స్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. 

Updated Date - 2020-07-12T20:30:57+05:30 IST