గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో యంగ్‌ హీరోయిన్‌

ABN , First Publish Date - 2020-11-17T21:39:01+05:30 IST

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌.. దేశంలో ప్రతి చోటా వినబడుతున్న పేరు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ మొదలుపెట్టిన ఈ ఛాలెంజ్‌.. ఇప్పుడు

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో యంగ్‌ హీరోయిన్‌

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌.. దేశంలో ప్రతి చోటా వినబడుతున్న పేరు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ మొదలుపెట్టిన ఈ ఛాలెంజ్‌.. ఇప్పుడు మహాయజ్ఞంలా మారి.. దేశమంతా వ్యాపించింది. సెలబ్రిటీలు, క్రీడాకారులు, సామాన్యులు.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ ఛాలెంజ్‌ స్వీకరించి మొక్కలు నాటి, మరో ముగ్గురిని ఈ ఛాలెంజ్‌కి నామినేట్‌ చేస్తున్నారు. తాజాగా హీరో సుశాంత్‌ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించింది నటి ఐశ్వర్య రాజేష్‌. 'కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్‌ లవర్‌' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఐశ్వర్య రాజేష్‌.. మంగళవారం హైదరాబాద్‌ మాదాపూర్‌లో మొక్కలు నాటి.. ఈ ఛాలెంజ్‌లో భాగమయ్యారు.


మొక్కలు నాటిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. ''మానవ మనుగడకు మొక్కలు చాలా ముఖ్యం. రోజురోజుకు పట్టణాల్లో పచ్చదనం తగ్గిపోతుంది. కాబట్టి అందరం బాధ్యతగా మొక్కలు నాటి, మనం పీల్చుకునే ఆక్సిజన్‌ను మనమే పెంచుకోవాలి. ఇంత మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌గారికి కృతజ్ఞతలు. ఈ ఛాలెంజ్‌లో నేనూ భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఈ ఛాలెంజ్‌ ఇదే విధంగా కొనసాగాలని కోరుతూ.. నా అభిమానులు, స్నేహితులు.. ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటి.. ఆ ఫొటోలను పంపిస్తే.. వాటిని నేను షేర్  చేస్తాను.." అని తెలిపారు.

Updated Date - 2020-11-17T21:39:01+05:30 IST