కాస్టింగ్ కౌచ్‌తో పాటు వర్ణ వివక్షనూ ఎదుర్కొన్నా: ఐశ్వర్య

ABN , First Publish Date - 2020-05-25T21:53:16+05:30 IST

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని భాషల చిత్ర పరిశ్రమలను వేడెక్కించింది మీటూ ఉద్యమం

కాస్టింగ్ కౌచ్‌తో పాటు వర్ణ వివక్షనూ ఎదుర్కొన్నా: ఐశ్వర్య

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని భాషల చిత్ర పరిశ్రమలను వేడెక్కించింది మీటూ ఉద్యమం. గతంలో మహిళలను వేధించిన చాలా మంది సినీ ప్రముఖుల పేర్లు ఈ ఉద్యమంలో భాగంగా బయటకు వచ్చాయి. చాలా మంది హీరోయిన్లు గతంలో తామెదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి వెల్లడించారు. 


తాజాగా నటి ఐశ్వర్యా రాజేష్ కూడా కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించింది. `కెరీర్ ఆరంభంలో నేనూ చాలా వేధింపులకు గురయ్యాను. లైంగిక వేధింపులతోపాటు నేను వర్ణ వివక్షను కూడా ఎదుర్కొన్నా. నల్లగా ఉన్నానని చాలా మంది అవహేళన చేశారు. `నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదు` అని ఓ ప్రముఖ దర్శకుడు అన్నారు. `ఓ కమెడియన్ పక్కన వేషం ఇస్తాను.. చేస్తావా` అని అడిగారు. అలాంటి ఎన్నో వేధింపులను ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చాన`ని ఐశ్వర్య చెప్పింది. ఐశ్వర్య తెలుగులో `కౌశల్యా కృష్ణమూర్తి`, `వరల్డ్ ఫేమస్ లవర్` వంటి చిత్రాల్లో నటించింది. 

Updated Date - 2020-05-25T21:53:16+05:30 IST

Read more