దీపికా పదుకొనే, ఐశ్వర్యరాయ్ డ్యాన్స్ వీడియో వైరల్

ABN , First Publish Date - 2020-05-26T03:19:06+05:30 IST

కరోనా ఎఫెక్ట్‌తో ఏర్పడిన లాక్‌డౌన్‌లో పెద్ద తెరపై ఎంటర్‌టైన్‌మెంట్ లేదనే వెలితి తప్ప.. చిన్నతెరపై మాత్రం కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ని నెటిజన్లు పొందుతున్నారు. నటీనటులు

దీపికా పదుకొనే, ఐశ్వర్యరాయ్ డ్యాన్స్ వీడియో వైరల్

కరోనా ఎఫెక్ట్‌తో ఏర్పడిన లాక్‌డౌన్‌లో పెద్ద తెరపై ఎంటర్‌టైన్‌మెంట్ లేదనే వెలితి తప్ప.. చిన్నతెరపై మాత్రం కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ని నెటిజన్లు పొందుతున్నారు. నటీనటులు ఈ లాక్‌డౌన్‌లో సోషల్ మీడియాని చాలా బాగా వాడారు, వాడుతున్నారు. వారి ఓల్డ్ వీడియోస్ షేర్ చేయడం, లైవ్‌లో పాల్గొని అభిమానులతో ముచ్చటించడం వంటివి ఈ లాక్‌డౌన్‌లో విపరీతంగా జరుగుతున్నాయి. తాజాగా దీపికా పదుకొనే, ఐశ్వర్యరాయ్‌ల డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ పార్టీలో వీరిద్దరు డ్యాన్స్ చేసిన వీడియోను జూమ్ టీవీ ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసింది. 


ఓ విందు కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్లు దీపిక పదుకొనే, ఐశ్వ‌ర్యరాయ్ డ్యాన్స్ చేసిన పాత వీడియో ఇది. ఆ ఇద్దరు హీరోయిన్లు ఎంతో హుషారుగా.. డ్యాన్స్‌ చేస్తున్న తీరుకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. దీపికా అయితే రెడ్ కలర్ ఔట్‌ఫిట్ ధ‌రించి, చేతిలో డ్రింక్‌ గ్లాస్ పట్టుకుని స్టెప్పులేస్తుంటే.. ఆమెను పక్కకు తీసుకుని వచ్చి ఐశ్వర్యరాయ్ ఆమెతో కలిసి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఐశ్వర్యరాయ్ తీరుకు దీపికా కొంచెం సేపు షాక్ అయినప్పటికీ.. తేరుకుని తనతో కలిసి డ్యాన్స్ చేసింది. ఇక ఈ డ్యాన్స్‌లో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీపికాను కౌగిలించుకుని మరీ ఐశ్వర్యరాయ్ డ్యాన్స్ చేయడం. చెబుతుంటేనే ఇంత థ్రిల్‌గా ఉంటే.. ఇక ఆ డ్యాన్స్ వీడియోని చూస్తే ఇంకెంత మజాగా ఉంటుందో ఆలోచించండి. మరెందుకు ఆలస్యం.. క్రింది లింక్‌లో వారి డ్యాన్స్‌ను చూసేయండి.Updated Date - 2020-05-26T03:19:06+05:30 IST