ఆసుపత్రిలోనే అమితాబ్, అభిషేక్.. ఐశ్వర్య, ఆరాధ్య ఇంటికి!

ABN , First Publish Date - 2020-07-27T22:49:33+05:30 IST

ఇటీవల కరోనా బారినపడి ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న బాలీవుడ్ ప్రముఖ నటి

ఆసుపత్రిలోనే అమితాబ్, అభిషేక్.. ఐశ్వర్య, ఆరాధ్య ఇంటికి!

ముంబై: ఇటీవల కరోనా బారినపడి ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ డిశ్చార్జ్ అయ్యారు. పది రోజుల చికిత్స అనంతరం ఆమె పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఐశ్వర్య, 8 ఏళ్ల కుమార్తె‌ ఆరాధ్యకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ అని నిర్ధారణ కావడంతో వైద్యులు వారిని డిశ్చార్జ్ చేసినట్టు అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. అయితే, తాను, తన తండ్రి అమితాబ్ బచ్చన్ ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నట్టు తెలిపారు. 


‘‘మాకోసం ప్రార్థించిన మీ అందరికీ కృతజ్ఞతలు. మీ అందరికీ రుణపడి ఉంటాను. ఐశ్వర్య, ఆరాధ్యలకు నెగటివ్ రిపోర్టులు వచ్చాయి. ఆసుపత్రి నుంచి వారు డిశ్చార్జ్ అయ్యారు. వారిప్పుడు ఇంట్లో ఉంటారు. నేను, నా తండ్రి అమితాబ్ మాత్రం ఇంకా ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాం’’ అని అభిషేక్ ట్వీట్ చేశారు.   

Updated Date - 2020-07-27T22:49:33+05:30 IST

Read more