`అంధాదున్` రీమేక్‌కు ఐశ్వర్య ఓకే చెబుతుందా?

ABN , First Publish Date - 2020-10-14T17:27:25+05:30 IST

బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్ `అంధాదున్` సినిమా పలు దక్షిణాది భాషల్లోకి రీమేక్ అవుతోంది.

`అంధాదున్` రీమేక్‌కు ఐశ్వర్య ఓకే చెబుతుందా?

బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్ `అంధాదున్` సినిమా పలు దక్షిణాది భాషల్లోకి రీమేక్ అవుతోంది. తెలుగులో డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా తమన్నా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తోంది. `అంధాదున్` సినిమా తమిళ రీమేక్‌లో సీనియర్ హీరో ప్రశాంత్ నటిస్తున్నారు. ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత తియగరాజన్ నిర్మిస్తున్నారు. 


మాతృకలో టబు పోషించిన పాత్ర కోసం ఐశ్వర్యారాయ్‌ను సంప్రదించారట. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుగుతున్నాయని, అయితే ఆమె నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందనా రాలేదని తియగరాజన్ తెలిపారు. ఒకవేళ ఐశ్వర్య ఓకే చెబితే 22ఏళ్ల తర్వాత మళ్లీ ఈ జోడీ వెండితెరపై సందడి చేయనుంది. 1998లో ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన `జీన్స్` సినిమాలో ప్రశాంత్, ఐశ్వర్య జంటగా నటించారు. 

Updated Date - 2020-10-14T17:27:25+05:30 IST