ఐశ్వర్య దీపం... అమితాబ్ టార్చ్...

ABN , First Publish Date - 2020-04-06T10:48:38+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ నిన్న రాత్రి 9 గంటలకు 9 నిముషాల పాటు అందరి ఇళ్లలోని లైట్లను ఆపివేసి, దీపాన్ని వెలిగించి ఐక్యతా సందేశాన్ని చాటాలని....

ఐశ్వర్య దీపం... అమితాబ్ టార్చ్...

ప్రధాని నరేంద్ర మోదీ నిన్న రాత్రి 9 గంటలకు 9 నిముషాల పాటు అందరి ఇళ్లలోని లైట్లను ఆపివేసి, దీపాన్ని వెలిగించి ఐక్యతా సందేశాన్ని చాటాలని ప్రజలను అభ్యర్థించారు. దీనికి దేశవ్యాప్తంగా పూర్తి మద్దతు లభించింది. బాలీవుడ్ పరిశ్రమలోని తారలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన కుటుంబంతో పాటు కొవ్వొత్తి వెలిగించారు. ఆమెతో పాటు అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య కూడా అక్కడే ఉన్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆకాశం వైపు ఫ్లాష్ లైట్ చూపించి ప్రపంచానికి ఐక్యతా సందేశాన్ని ఇచ్చారు.

Updated Date - 2020-04-06T10:48:38+05:30 IST