సుశాంత్ మృతి: ఎయిమ్స్ కీలక రిపోర్టు!

ABN , First Publish Date - 2020-09-29T21:57:29+05:30 IST

బాలీవుడ్‌ యంగ్‌హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు తుది నివేదికను ఎయిమ్స్‌ సమర్పించింది.

సుశాంత్ మృతి: ఎయిమ్స్ కీలక రిపోర్టు!

బాలీవుడ్‌ యంగ్‌హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు తుది నివేదికను ఎయిమ్స్‌ సమర్పించింది. సీబీఐ అభ్యర్థన మేరకు డా.సుధీర్ గుప్తా అధ్యక్షతన రంగంలోకి దిగిన ఫోరెన్సిక్ బృందం సుశాంత్ శరీర భాగాల్లోంచి తీసిన నమూనాలను పరీక్షించింది. తమ పరీక్షల ఆధారంగా తయారు చేసిన నివేదికను సీబీఐకి సమర్పించింది. 


సుశాంత్‌ మృతదేహంలో ఎలాంటి విషమూ లేదని, ఆయన మృతికి ఉరి వేసుకోవడమే కారణమని ఎయిమ్స్‌ వర్గాలు ధ్రువీకరించినట్టు సమాచారం. సుశాంత్‌ డీఎన్‌ఏను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నివేదికను సమర్పిస్తున్నామని, దీనిలో ఎలాంటి సందేహాలు అవసరంలేదని పేర్కొన్నట్టు తెలుస్తోంది. గతంలో మహారాష్ట్ర వైద్యుల నివేదికలో వెల్లడించిన విషయాలే తమ పరిశీలనలోనూ తేలాయని పేర్కొన్నట్టు సమాచారం. తాజా నివేదిక ఆధారంగా మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. అనేక వివాదాలు, ఆరోపణల నడుమ సుశాంత్‌ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకు అప్పగించింది. ఈ క్రమంలోనే ఎయిమ్స్‌ తన రిపోర్టును సమర్పించింది.


Updated Date - 2020-09-29T21:57:29+05:30 IST