అడివి శేష్ `మేజ‌ర్‌`లో `ద‌బాంగ్-3` బ్యూటీ!

ABN , First Publish Date - 2020-09-24T16:20:27+05:30 IST

సూపర్‌స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో అడవి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `మేజర్`.

అడివి శేష్ `మేజ‌ర్‌`లో `ద‌బాంగ్-3` బ్యూటీ!

సూపర్‌స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `మేజర్`.  శ‌శికిర‌ణ్ తిక్క ఈ సినిమాకు దర్శకుడు. 2008 ముంబై తీవ్రవాద దాడుల్లో అమ‌రుడైన‌ ఎన్ఎస్‌జీ క‌మాండో సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగు, హిందీ భాష‌ల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.


ఈ సినిమాలో `ద‌బాంగ్ 3` బ్యూటీ స‌యీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈమె ప్రముఖ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె. ఇక, `గూఢ‌చారి` హీరోయిన్ శోభిత ధూళిపాళ మరో ముఖ్య పాత్ర‌లో కనిపించనుంది. ఇప్ప‌టికి 50 శాతానికి పైగా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. మహేష్ నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఏ ప్ల‌స్ ఎస్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 2021 వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 
Updated Date - 2020-09-24T16:20:27+05:30 IST