కంగన కూడా డ్రగ్స్ తీసుకుంది కదా..: నగ్మా సంచలన కామెంట్స్

ABN , First Publish Date - 2020-09-24T18:39:23+05:30 IST

గతంలో డ్రగ్స్ తీసుకున్నట్టు స్వయంగా వెల్లడించిన కంగనా రనౌత్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూర్ (ఎన్‌సీబీ) ఎందుకు సమన్లు పంపించలేదని

కంగన కూడా డ్రగ్స్ తీసుకుంది కదా..: నగ్మా సంచలన కామెంట్స్

గతంలో డ్రగ్స్ తీసుకున్నట్టు స్వయంగా వెల్లడించిన కంగనా రనౌత్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూర్ (ఎన్‌సీబీ) ఎందుకు సమన్లు పంపించలేదని సీనియర్ హీరోయిన్, కాంగ్రెస్ నేత నగ్మా ప్రశ్నించారు. ప్రముఖ కథానాయికలు దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్‌లకు ఎన్‌సీబీ సమన్లు అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగ్మా ట్విటర్ ద్వారా స్పందించారు. 


`గతంలో తాను డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించిన కంగనా రనౌత్‌కు ఎన్‌సీబీ ఎందుకు సమన్లు పంపలేదు. వాట్సాప్ ఛాట్ ఆధారంగానే మిగిలిన హీరోయిన్లను పిలిచారు కదా! మరి, స్వయంగా వెల్లడించిన కంగనను ఎందుకు పిలవలేద? అయినా టాప్ హీరోయిన్స్‌‌కు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు లీక్ చేసి వారి ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడమే ఎన్‌సీబీ డ్యూటీయా` అని నగ్మా ప్రశ్నించారు. 

Updated Date - 2020-09-24T18:39:23+05:30 IST