టాలీవుడ్‌లో ఏజ్ అనేది కేవలం నెంబర్ మాత్రమే

ABN , First Publish Date - 2020-06-12T04:47:26+05:30 IST

టాలీవుడ్‌లో ఏజ్ అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే. ఇదే విషయం గత వారం రోజులుగా నందమూరి నటసింహ బాలయ్య తన ఇంటర్వ్యూలలో చెబుతున్నారు. ఒక్క బాలయ్యే కాదు

టాలీవుడ్‌లో ఏజ్ అనేది కేవలం నెంబర్ మాత్రమే

టాలీవుడ్‌లో ఏజ్ అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే. ఇదే విషయం గత వారం రోజులుగా నందమూరి నటసింహ బాలయ్య తన ఇంటర్వ్యూలలో చెబుతున్నారు. ఒక్క బాలయ్యే కాదు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వీరిలో ఎవరైనా సరే.. వారి ఏజ్‌ని అస్సలు లెక్కచేయరు. వారి వయసు 60 చుట్టూ తిరుగుతున్నా కూడా యంగ్ హీరోలకు ఏ విషయంలోనూ వెనుకాడటం లేదు. డ్యాన్స్‌లు, ఫైట్స్.. ఇలా ఏదైనా సరే.. మేం రెడీ అనేస్తున్నారు. ఇక ప్రస్తుతం కరోనా సమస్య ఏ విధంగా విజృంభిస్తుందో తెలియంది కాదు. ఇలాంటి సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలు షూటింగ్‌లకు అనుమితినిస్తూ జీవోలు విడుదల చేశాయి. అయితే కొన్ని నిబంధనలను విధించి, వాటికి అనుగుణంగా మాత్రమే షూటింగ్స్ చేసుకోవాలని అనుమతులు జారీ చేశాయి. అయితే ఈ నిబంధనలలో ఎక్కడా వయసుకు సంబంధించి తెలియజేయలేదు. కొన్ని రాష్ట్రాల్లో 60కి పైగా వయసు ఉన్నవాళ్లు షూటింగ్స్‌కు అనుమతింపబడరు అని నిబంధనలలో పేర్కొన్నాయి. కానీ టాలీవుడ్‌కి సంబంధించి అలాంటి నిబంధనలు లేకపోవడం విశేషం.


కేంద్ర ప్రభుత్వంతో పాటు కొన్ని రాష్ట్రాలు 8 సంవత్సరాల లోపు వారు, అలాగే 60 సంవత్సరాలు పైబడిన వారు ఇంటినుంచి బయటికి రావద్దనే నిబంధనలను విధించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన చూస్తే టాలీవుడ్‌లో 60 చుట్టూ ఉన్న నటులు ఎక్కువగానే కనిపిస్తారు. ఇక స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున కూడా ఈ జాబితాలోకే వస్తారు. ఇంకా చెప్పాలంటే వెంకీ ఇంకా 60వ పడిలోకి చేరలేదంతే. అందుకే టాలీవుడ్‌కి ఈ నిబంధనలు వర్తించవు అనేలా వయసుకు సంబంధించిన నిబంధనలు చేర్చలేదు. ఒకవేళ చేర్చి ఉంటే ఇప్పట్లో షూటింగ్స్ జరగడం కష్టమే. అందుకే అనేది టాలీవుడ్‌లో ఏజ్ అనేది కేవలం నెంబర్ మాత్రమే అని.

Updated Date - 2020-06-12T04:47:26+05:30 IST