మళ్లీ... పెళ్లి వాయిదా

ABN , First Publish Date - 2020-05-04T06:58:01+05:30 IST

‘‘మొదట ఏప్రిల్‌ 16న పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అయితే, ఏడడుగులు వేయడానికి నెల రోజుల సమయం ఉందనగా లాక్‌డౌన్‌ విధించారు. అందువల్ల, మా కుటుంబం, పల్లవి (కాబోయే శ్రీమతి) కుటుంబం కలిసి పెళ్లిని మే 14కి వాయిదా...

మళ్లీ... పెళ్లి వాయిదా

‘‘మొదట ఏప్రిల్‌ 16న పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అయితే, ఏడడుగులు వేయడానికి నెల రోజుల సమయం ఉందనగా లాక్‌డౌన్‌ విధించారు. అందువల్ల, మా కుటుంబం, పల్లవి (కాబోయే శ్రీమతి) కుటుంబం కలిసి పెళ్లిని మే 14కి వాయిదా వేయాలని ఓ నిర్ణయానికి వచ్చాం. ఇప్పుడు, మళ్లీ  లాక్‌డౌన్‌ పొడిగించారు. ఈ నిర్ణయంతో నేను తీవ్రంగా నిరాశ చెందాను’’ అని యువ కథానాయకుడు నిఖిల్‌ సిద్ధార్థ అసహనం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 3న పల్లవీ వర్మతో ఆయన నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఒకసారి వివాహాన్ని వాయిదా వేసుకున్న నిఖిల్‌, లాక్‌డౌన్‌ 3.0తో మరోసారి వాయిదా వేసుకోక తప్పలేదు.


కరోనాపై యుద్ధంలో విజయం సాధించే వరకూ పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా నిఖిల్‌ మాట్లాడుతూ ‘‘నాకంటే పెద్ద సమస్యలతో పోరాడుతున్న ప్రజలు ఉన్నాయి. నా పెళ్లి వల్ల ఒక్కరిపై ఎఫెక్ట్‌ పడినా నేను ప్రశాంతంగా జీవించలేను. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోయే అత్యంత మధురమైన రోజు. ఈ సంక్షోభ సమయంలో పెళ్లి చేసుకోవడం సరైనది కాదు. అందుకని, నాతో సహా పల్లవి మరికొన్ని రోజులు ఎదురు చూడాలని అనుకుంటోంది. కరోనాపై మనం తప్పకుండా విజయం సాధిస్తాం. ఈ యుద్ధంలో గెలిచిన తర్వాత వేడుకలా పెళ్లి చేసుకుంటా. పెద్ద పార్టీ ఇస్తా’’ అన్నారు.

Updated Date - 2020-05-04T06:58:01+05:30 IST