మళ్లీ ప్రభాస్‌తో సినిమానా.. వామ్మో..!: రాజమౌళి

ABN , First Publish Date - 2020-12-01T02:30:27+05:30 IST

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఇప్పటికే మూడు సినిమాలు చేశారు. 'ఛత్రపతి', 'బాహుబలి 1', 'బాహుబలి2' చిత్రాలలో ప్రభాస్‌ని ఏ రేంజ్‌లో

మళ్లీ ప్రభాస్‌తో సినిమానా.. వామ్మో..!: రాజమౌళి

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఇప్పటికే మూడు సినిమాలు చేశారు. 'ఛత్రపతి', 'బాహుబలి 1', 'బాహుబలి2' చిత్రాలలో ప్రభాస్‌ని ఏ రేంజ్‌లో రాజమౌళి ఎలివేట్‌ చేశారో తెలియంది కాదు. ముఖ్యంగా బాహుబలి తర్వాత ప్రభాస్‌ రేంజే మారిపోయింది. చేస్తే పాన్‌ ఇండియా సినిమానే అనేలా ప్రభాస్‌ స్టార్‌ డమ్‌ మారిపోయింది. ఇప్పుడు ప్రభాస్‌ చేసే సినిమాలన్నీ కూడా పాన్‌ ఇండియా సినిమాలే. అలాగే పాన్‌ ఇండియా స్టార్‌కి సరికొత్త నిర్వచనం ప్రభాస్‌ అనే రేంజ్‌కి వెళ్లిపోయాడు ప్రభాస్‌. మరి అటువంటి ప్రభాస్‌ని మరోసారి డైరెక్ట్ చేస్తారా? అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళికి ఓ ప్రశ్న ఎదురైంది.


దీనికి రాజమౌళి సమాధానమిస్తూ.. ''వామ్మో.. మళ్లీ ప్రభాస్‌తోనా?.. బాహుబలి కోసం దాదాపు 5 సంవత్సరాలు కలిసి చేశాం. మళ్లీ మా కాంబినేషన్‌లో సినిమా అంటే.. జనాలు తలలు పట్టుకుంటారేమో..'' అని అన్నారు. ఏంటి ఇదంతా నిజమే అనుకుంటున్నారా? కాదు లెండి. రాజమౌళి ఈ మాటలు సరదాగా మాట్లాడారు. పై మాటలు అన్న తర్వాత సరదాగా నవ్విన రాజమౌళి.. ''సరదాగా అలా అన్నాను.. నిజంగా ప్రభాస్‌తో సినిమా చేయడం నాకు కూడా ఇష్టమే. మంచి కథ కుదిరితే.. తప్పకుండా మేం మళ్లీ సినిమా చేస్తాం..'' అని రాజమౌళి చెప్పుకొచ్చారు. 

Updated Date - 2020-12-01T02:30:27+05:30 IST

Read more