80స్ పార్టీకి నన్ను పిలవలేదు: బాలకృష్ణ

ABN , First Publish Date - 2020-06-10T04:16:37+05:30 IST

మరోసారి మెగాస్టార్ చిరంజీవిని నందమూరి నటసింహ బాలకృష్ణ టార్గెట్ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయన పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్న విషయం

80స్ పార్టీకి నన్ను పిలవలేదు: బాలకృష్ణ

మరోసారి మెగాస్టార్ చిరంజీవిని నందమూరి నటసింహ బాలకృష్ణ టార్గెట్ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయన పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో ఏదో ఒక విషయం హాట్ హాట్‌గా పేలుతుంది. ముఖ్యంగా చిరంజీవిని టార్గెట్ చేస్తూ ఆయన సంధిస్తున్న బాణాలు టాలీవుడ్‌ని షేక్ చేస్తున్నాయి. ఇటీవల రెండు మూడు సందర్భాల్లో నన్ను ఎందుకు పిలవలేదంటూ డైరెక్ట్‌గానే అడిగేసిన బాలయ్య.. తాజాగా మరో విషయాన్ని హైలెట్ చేస్తూ.. మెగాస్టార్‌‌‌కు, తనకు మధ్య విభేదాలు ఉన్నాయనే విధంగా కామెంట్స్ చేశారు.


ప్రతి సంవత్సరం 80స్ తారలందరూ రీయూనియన్ పార్టీ జరుపుకునే విషయం తెలిసిందే. ఈసారి ఈ వేడుకలు హైదరాబాద్‌లో చిరంజీవి ఇంట్లో జరిగిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ వేడుకలకు నన్ను పిలవలేదంటూ బాలయ్య తన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. “80స్ తారల రీ యూనియన్ ప్రతీ ఏడాది జరుగుతుంది. ఈసారి హైదరాబాద్‌లోనే పార్టీ జరిగింది. దానికి నన్ను పిలవలేదు. ఎందుకని నన్ను అవాయిడ్ చేసారు? అంబరీష్‌గారి ఇంట్లో పార్టీ జరిగినప్పుడు పిలిచారు వెళ్లాను. మోహన్ లాల్‌గారు హోస్ట్ చేసినప్పుడు వెళ్లాను. అయినా ఐ డోంట్ కేర్. నాదంతా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ పాలసీ. చేస్తే పూర్తిగా అవాయిడ్ చేసేయండి. అప్పుడు నా దారిలో నేను వెళ్తా.. అంతే” అంటూ బాలయ్య మరోసారి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. మరి దీనిపై చిరు రియాక్షన్ ఎలా ఉంటుందో..?Updated Date - 2020-06-10T04:16:37+05:30 IST