‘మేజర్‌’ ఫస్ట్ లుక్‌ వస్తోంది

ABN , First Publish Date - 2020-12-15T23:59:06+05:30 IST

'క్ష‌ణం, గూఢచారి, ఎవ‌రు' వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటిస్తున్న లేటెస్ట్

‘మేజర్‌’ ఫస్ట్ లుక్‌ వస్తోంది

'క్ష‌ణం, గూఢచారి, ఎవ‌రు' వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో  త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మేజర్'. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో ప్రజలను కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా 'గూఢ‌చారి' ఫేమ్‌ శ‌శి కిర‌ణ్‌ తిక్కా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  అడవి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్  ప‌తాకాల‌పై నిర్మిస్తున్నారు. 


ఇప్పటికే విడుదలైన పోస్ట‌ర్స్ సినిమాపై ఆసక్తిని రేపగా.. రీసెంట్‌గా లుక్‌ టెస్ట్ అంటూ ఓ వీడియోని సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో  'మేజర్' సినిమా ఎలా మొదలైంది.. లుక్ టెస్ట్ ఎలా జరిగింది అనే విషయాల‌ను అడివి శేష్ తెలిపారు. ఈ లుక్‌ టెస్ట్ వీడియో కూడా మంచి స్పందనను రాబట్టుకుంది. ఇక చిత్రయూనిట్‌ ఫస్ట్ లుక్‌పై ఫోకస్‌ పెట్టింది. హీరో అడవి శేష్‌ పుట్టినరోజు (డిసెంబర్‌ 17) సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా చిత్రయూనిట్‌ ప్రకటించింది. లుక్‌ టెస్ట్‌కు వచ్చిన స్పందనకు ఎంతగానో సంతోషిస్తున్నాం.. ఫస్ట్‌ లుక్‌తో వచ్చేందుకు ఎంతగానో ఎగ్జయిటెడ్‌గా వెయిట్‌ చేస్తున్నాం అని తెలుపుతూ.. ఫస్ట్ లుక్‌ను డిసెంబర్‌ 17 ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్‌ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.Updated Date - 2020-12-15T23:59:06+05:30 IST

Read more