'మహాసముద్రం'లో మధ్యతరగతి అమ్మాయిగా అదితి

ABN , First Publish Date - 2020-10-12T15:46:53+05:30 IST

'మహా సముద్రం'లో హీరోయిన్‌గా అదితిరావు హైదరి నటిస్తున్నట్లు చిత్ర యూనిట్‌ అదికారికంగా ప్రకటించింది.

'మహాసముద్రం'లో మధ్యతరగతి అమ్మాయిగా అదితి

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా 'ఆర్.ఎక్స్‌ 100' దర్శకుడు అజయ్‌ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రం 'మహాసముద్రం'. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా అదితిరావు హైదరి నటిస్తున్నట్లు చిత్ర యూనిట్‌ అదికారికంగా ప్రకటించింది. లవ్‌ అండ్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రంలో అదితిరావు హైదరి మధ్య తరగతి అమ్మాయి పాత్రలో నటిస్తుంది. దర్శకుడు అజయ్‌ భూపతి, ఆమె పాత్రను మలచిన తీరు నచ్చడంతో సినిమాలో నటించడానికి అదితిరావ్‌ వెంటనే ఓకే చెప్పేశారు. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. 

Updated Date - 2020-10-12T15:46:53+05:30 IST