బాలూ కోలుకోవాలని.. ఓ బుల్లి అభిమాని ఇలా..

ABN , First Publish Date - 2020-08-27T03:45:18+05:30 IST

హైదరాబాద్: చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాలంటూ తెలుగురాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లో ప్రార్ధనలు, హోమాలు చేస్తున్నారు.

బాలూ కోలుకోవాలని.. ఓ బుల్లి అభిమాని ఇలా..

హైదరాబాద్: చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాలంటూ తెలుగురాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లో ప్రార్ధనలు చేస్తున్నారు. ఈ తరుణంలో మహర్షి బాదరాయణ్ వ్యాస్ సమ్మాన్ పురస్కార గ్రహీత డా. అద్దంకి శ్రీనివాస్ రచనలో ఆయన ఎనిమిదేళ్ల కుమార్తె వనీజ ఓ పాట పాడింది. సాగర సంగమం సినిమాలోని... వేదం... అణువణువున నాదం... అనే పాట బాణీలో ఈ సాహిత్యాన్ని సమకూర్చారు. బాలు త్వరగా మన మధ్యకు రావాలని కోరుకుంటూ తన సంకల్పాన్ని చిన్నారి ఈ పాట రూపంలో వ్యక్తం చేసింది.Updated Date - 2020-08-27T03:45:18+05:30 IST