‘క్వశ్చన్‌ మార్క్‌’.. ఆదాశ‌ర్మ‌ స్టెప్స్ అదుర్స్‌

ABN , First Publish Date - 2020-10-30T23:06:36+05:30 IST

ఆదాశర్మ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'క్వశ్చన్‌ మార్క్‌ (?)'. శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకంపై విప్రా దర్శకత్వంలో గౌరీ కృష్ణ నిర్మాతగా గౌరు ఘనా సమర్పణలో

‘క్వశ్చన్‌ మార్క్‌’.. ఆదాశ‌ర్మ‌ స్టెప్స్ అదుర్స్‌

ఆదాశర్మ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'క్వశ్చన్‌ మార్క్‌ (?)'. శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకంపై విప్రా దర్శకత్వంలో గౌరీ కృష్ణ నిర్మాతగా గౌరు ఘనా సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ అనంతర కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోంది. తాజాగా ఈ చిత్రంలోని 'రామ‌స‌క్క‌నోడివిరో' అనే పాట‌ను విడుదల చేశారు. ఈ పాట‌ను ర‌ఘు కుంచె స్వ‌ర‌ప‌ర‌చ‌గా బండి స‌త్యం సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. మంగ్లీ ఆల‌పించ‌గా శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేశారు.

 

పాట విడుదల సందర్భంగా సంగీత ద‌ర్శ‌కుడు ర‌ఘు కుంచె మాట్లాడుతూ.. ఈ సినిమాలో ముందుగా అసలు పాటలు లేవు. షూటింగ్ పూర్త‌య్యాక ఇటీవల అనుకొని ఈ సాంగ్ చేశాం. బండి స‌త్యంగారు అద్బుత‌మైన సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ గారు కంపోజ్ చేసిన స్టెప్స్ ఆదాశ‌ర్మ‌గారు అద‌ర‌గొట్టారు. నిర్మాత గౌరికృష్ణ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. ద‌ర్శ‌కుల ప‌నితీరు ఏమిటో ఈ పాట‌తోనే తెలుసుకోవ‌చ్చు. ఇక ఈ పాండ‌మిక్ టైమ్‌లో ఈ సినిమా రావ‌డం కొంత సంతోషాన్ని క‌లిగించే విష‌యం అన్నారు.


ఈ పాట‌కు సంబంధించిన క్రెడిట్ అంతా మా మ్యూజిక్ డైర‌క్ట‌ర్ ర‌ఘుకుంచెకి వెళ్తుంది. ఆయ‌న ఈ పాట‌తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా ఎక్స్‌లెంట్‌గా ఇచ్చారు. ఆదాశ‌ర్మ ఈ సినిమా కోసం ఎంతో హార్డ్ వ‌ర్క్ చేశారు. త‌న ప‌ర్ఫార్మెన్స్ మాత్ర‌మే కాదు త‌న ఎంత మంచి డాన్సరో ఈ సినిమాతో తెలుస్తుంది అని నిర్మాత గౌరీ కృష్ణ తెలిపారు. ప్ర‌స్తుతం విడుద‌ల స‌న్నాహాల్లో ఉన్నాం. త్వ‌ర‌లో విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తామని అన్నారు. ఇక దర్శకుడు విప్రా మాట్లాడుతూ.. ఇలాంటి సంక్లిష్ట స‌మ‌యంలో సినిమా చేయ‌డ‌మ‌నేది ఎంతో రిస్క్‌తో కూడుకున్న‌ది. మా నిర్మాత స‌హ‌కారం వ‌ల్లే ఇది చేయ‌గ‌లిగాం. మా టీమ్ అంతా కూడా ఎంతో స‌హ‌కరించారు. ముఖ్యంగా ఆదాశ‌ర్మ‌గారి స‌పోర్ట్ మ‌రువ‌లేము.  క‌రోనా జాగ్ర‌త్త‌లు తీసుకుని సినిమా చేశాం. ర‌ఘు కుంచెగారు మంచి పాటిచ్చారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీతో ఈ పాటని నెక్స్ట్‌ లెవల్‌కి తీసుకు వెళ్లారని.. అన్నారు.


హీరోయిన్ ఆదా శర్మ మాట్లాడుతూ.. ఒక డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా వ‌స్తోంది. నేను తెలుగులో చేసిన సినిమాల‌న్నీ కూడా ప‌ర్ఫార్మెన్స్‌కి స్కోప్‌ ఉన్న చిత్రాలే. వాటి దారిలోనే ఈ సినిమాలో కూడా న‌ట‌నకు ప్రాధాన్య‌త ఉన్న పాత్ర చేశాను. అలాగే ఇందులో పాట‌కు  శేఖ‌ర్ మాస్ట‌ర్‌గారు మంచి స్టెప్స్ కూడా నాతో వేయించారు.  క‌రోనా టైమ్ లో స్టార్ట్ చేసి క‌రోనా టైమ్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోన్న మొద‌టి సినిమా మాది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. డైరెక్ట‌ర్స్ ఎక్స్ లెంట్‌గా డీల్ చేశారు.. అని తెలిపారు.







Updated Date - 2020-10-30T23:06:36+05:30 IST