ఈ ఛాలెంజ్‌ అద్భుతమంటోన్న ఆదాశర్మ

ABN , First Publish Date - 2020-11-06T01:19:17+05:30 IST

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన హరితహారం గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ మహా ఉద్యమంగా ముందుకు వెళుతున్న విషయం

ఈ ఛాలెంజ్‌ అద్భుతమంటోన్న ఆదాశర్మ

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన హరితహారం గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ మహా ఉద్యమంగా ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే. నటీనటులు, రాజకీయ నాయకులు.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ ఛాలెంజ్‌లో భాగం అవుతూ.. మొక్కలు నాటడమే కాకుండా.. మరికొంత మందిని ఈ ఛాలెంజ్‌కి నామినేట్‌ చేసి.. వారిని కూడా మొక్కలు నాటాలని కోరుతున్నారు. తాజాగా ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్న నటి ఆదాశర్మ.. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ అద్భుతంగా ఉందని తెలిపారు.


ఆదా శర్మ నటించిన 'క్వశ్చన్‌ మార్క్‌' మూవీ నిర్మాత ఇటీవల చిత్ర సాంగ్‌ విడుదల సందర్భంగా మొక్కలు నాటి.. హీరోయిన్‌ ఆదా శర్మకు ఈ ఛాలెంజ్‌ విసిరిన విషయం తెలిసిందే. నిర్మాత గౌరీ కృష్ణ ఇచ్చిన ఛాలెంజ్‌ని స్వీకరించిన ఆదాశర్మ.. ముంబైలోని తన నివాసంలో మొక్కలు నాటి.. ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నట్లుగా ట్విట్టర్‌ ద్వారా తెలిసింది. ఇంత నిస్వార్ధంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌కి అభినందనలు తెలిసిన ఆదాశర్మ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా అద్భుతమైనదని, ప్రతీ ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ముఖ్యంగా తన అభిమానులు అందరూ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాలని ఆమె పిలుపునిచ్చారు.Updated Date - 2020-11-06T01:19:17+05:30 IST