అదా శర్మ.. మదర్స్ డే సర్‌ప్రైజ్ వీడియో!

ABN , First Publish Date - 2020-05-11T16:35:38+05:30 IST

`హార్ట్ ఎటాక్`, `క్షణం` వంటి తెలుగు సినిమాల్లో నటించిన అదా శర్మ టాలీవుడ్‌లో పెద్దగా క్లిక్ కాలేకపోయింది

అదా శర్మ.. మదర్స్ డే సర్‌ప్రైజ్ వీడియో!

`హార్ట్ ఎటాక్`, `క్షణం` వంటి తెలుగు సినిమాల్లో నటించిన అదా శర్మ టాలీవుడ్‌లో పెద్దగా క్లిక్ కాలేకపోయింది. అయితే బాలీవుడ్‌లోనూ, హిందీ వెబ్‌సిరీస్‌ల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ బిజీగానే ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అదా శర్మ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతో అభిమానులను అలరిస్తోంది. 


తాజాగా మదర్స్ ‌డే సందర్భంగా అదా శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. `హ్యాపీ మదర్స్ డే. ఈ వీడియో చివరి దాకా చూడండి.  మా అమ్మ తెలివైంది, చురుకైనది, బలమైనది, అందమైనది, ఉత్తమమైనది. వంటలో మా అమ్మని ఎవరూ బీట్ చేయలేరు' అంటూ తన తల్లి గురించి కామెంట్ చేసింది. అదా పోస్ట్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. 
Updated Date - 2020-05-11T16:35:38+05:30 IST