అదా శర్మ హాట్ ఫొటోస్ వైరల్!

ABN , First Publish Date - 2020-12-08T02:50:14+05:30 IST

`హార్ట్ ఎటాక్` సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అదాశర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

అదా శర్మ హాట్ ఫొటోస్ వైరల్!

`హార్ట్ ఎటాక్` సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అదాశర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. హాట్ హాట్ ఫొటోషూట్లలో పాల్గొంటూ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తోంది. తాజాగా పలు హాట్ ఫొటోలను అదా శర్మ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.


ఈ హాట్ ఫొటోలతో పాటు బాలీవుడ్ నెపోటిజం గురించి హాట్ కామెంట్లు కూడా చేసింది. `స్టార్ కిడ్‌ను కానప్పటికీ నన్ను ఆదరించి ఆమోదించినందుకు ధన్యవాదాలు. (ప్రత్యేకించి ఇలాంటి నెపోటిజం, కరోనా పరిస్థితుల్లో) `పతీ పత్నీ ఔర్ పంగా` ట్రైలర్‌పై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. ఇంతకు ముందు ఎవరూ చేయని విభిన్నమైన పాత్రలు చేసే స్వేచ్ఛని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ మద్దతు ఉంది కాబట్టే నేను ధైర్యంగా ముందుకు వెళుతున్నాన`ని అదా పేర్కొంది. అదా శర్మ నటించిన `పతీ పత్నీ ఔర్ పంగా` వెబ్ సిరీస్‌ ట్రైలర్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-12-08T02:50:14+05:30 IST