కరెంట్ బిల్ చూసి షాకైన నటి స్నేహ ఫ్యామిలీ

ABN , First Publish Date - 2020-06-05T04:11:54+05:30 IST

కరెంట్‌కు తగిలితే షాక్ వస్తుంది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కరెంట్ బిల్ చూసినా కూడా షాక్ వస్తుంది. అదెలా అనుకుంటున్నారా? అయితే ఏపీ, తమిళనాడుకు వెళ్లి

కరెంట్ బిల్ చూసి షాకైన నటి స్నేహ ఫ్యామిలీ

కరెంట్‌కు తగిలితే షాక్ వస్తుంది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కరెంట్ బిల్ చూసినా కూడా షాక్ వస్తుంది. అదెలా అనుకుంటున్నారా? అయితే ఏపీ, తమిళనాడుకు వెళ్లి కరెంట్ బిల్స్ ఒక్కసారి చెక్ చేయండి.. ఖచ్చితంగా షాక్ వస్తుంది. కరోనా కష్టకాలంలో ప్రభుత్వాలు ఏమేం రాయితీలు ఇస్తాయా అని ఎదురుచూస్తున్న సామాన్య ప్రజలకు రాయితీల మాట అటుంచితే.. ఇప్పుడొస్తున్న కరెంట్ బిల్స్ షాక్‌నిస్తున్నాయి. ఇది నిజం. నమ్మకపోతే నటి స్నేహ భర్త అయిన ప్రసన్నను అడగండి. ఆయన తన ఫ్యామిలీకి వచ్చిన కరెంట్ బిల్ చూయిస్తారు. ఈ లాక్‌డౌన్‌లో కరెంట్ బిల్స్ కొంతమంది కట్టలేదు. అలాంటి వారికి 3 నెలల బిల్ కలిపి వేశారు. అవి మాములుగా లేవు. ఎప్పుడూ వందల్లో వచ్చే కరెంట్ బిల్ ఇప్పుడు వేలు, లక్షల్లో వస్తుండటంతో ప్రజలు నిజంగానే షాక్‌కి గురవుతున్నారు.


స్నేహ భర్త, నటుడు ప్రసన్న తాజాగా ట్విట్టర్‌లో తన ఫ్యామిలీకి ఉన్న రెండు కనెక్షన్స్‌కి సంబంధించిన కరెంట్ బిల్ రూ. 70 వేలు వచ్చిందని, తమిళనాడు విద్యుత్ సంస్థ దోపిడీ చేస్తుందని మండిపడ్డారు. నేను రూ. 70 వేలు కట్టగలను. కానీ సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు, తను ఎప్పుడూ కరెంట్ బిల్ విషయంలో ఆలస్యం చేయలేదని, బిల్ వచ్చిన 10 రోజుల్లోపు బిల్లుని చెల్లించేవాడినని తెలిపారు. బిల్లు లేకపోవడం వల్లే రెండు నెలలుగా బిల్ చెల్లించలేదని పేర్కొన్నారు. ఇంత కరెంట్ బిల్ అసలు ఇప్పటి వరకు మాకు ఎప్పుడు రాలేదని, ఈ లాక్‌డౌన్‌లో విద్యుత్ బోర్డ్ దోపిడీ చేస్తుందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.  

Updated Date - 2020-06-05T04:11:54+05:30 IST