ఆసుపత్రి నుంచి ప్రముఖ సినీనటి డిశ్చార్జ్

ABN , First Publish Date - 2020-02-02T00:46:38+05:30 IST

కారు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ ప్రముఖ నటి షబానాఅజ్మీ కోలుకోవడంతో వైద్యులు ఆమెను డిశ్చార్జి చేశారు. ముంబై

ఆసుపత్రి నుంచి ప్రముఖ సినీనటి డిశ్చార్జ్

ముంబై: కారు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ ప్రముఖ నటి షబానాఅజ్మీ కోలుకోవడంతో వైద్యులు ఆమెను డిశ్చార్జి చేశారు. ముంబై -పూణే ఎక్స్‌ప్రెస్ వేపై ఖాలాపూర్ టోల్ ప్లాజా వద్ద కారులో ఈ నెల 18వతేదీన ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాద ఘటనలో షబానాఅజ్మీ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన షబానాను వెంటనే నవీముంబైలోని మహాత్మాగాంధీ మిషన్ మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ముంబై నగరంలోని అంథేరి ప్రాంతంలో ఉన్న కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రికి మార్చారు.13 రోజుల పాటు చికిత్స అనంతరం షబానాఅజ్మీ ఆరోగ్యం మెరుగుపడటంతో వైద్యులు ఆమెను ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించారు. షబానాను కొంతకాలం ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. షబానాఅజ్మీ ఆసుపత్రిలో ఉన్నపుడు పలువురు సినీతారలు, సెలబ్రిటీలు వచ్చి ఆమెను పరామర్శించారు.

Updated Date - 2020-02-02T00:46:38+05:30 IST