ముమైత్ ఖాన్ మోసం చేసిందని డ్రైవర్ ఆవేదన

ABN , First Publish Date - 2020-09-29T23:44:02+05:30 IST

నటి ముమైత్ ఖాన్ తనను మోసం చేసిందని

ముమైత్ ఖాన్ మోసం చేసిందని డ్రైవర్ ఆవేదన

హైదరాబాద్ : నటి ముమైత్ ఖాన్ తనను మోసం చేసిందని క్యాబ్ డ్రైవర్ రాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పూర్తి వివరాల్లోకెళితే.. మూడు రోజులు గోవాకు వెళ్లాలని ముమైత్ మొదట కారు బుక్ చేసుకున్నది. ఆ తర్వాత మూడు రోజులను కాస్త ఎనిమిది రోజుల పాటు పొడిగించిందని డ్రైవర్ చెబుతున్నాడు. టోల్ గేట్‌కు, డ్రైవర్ అకామిడేషన్‌కు డబ్బులు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.


మొత్తం రూ.15 వేల వరకు ముమైత్ ఇవ్వాలని మీడియా, సోషల్ మీడియాలో రాజు ఆవేదన తెలియజేశాడు. మరో డ్రైవర్‌కు తనలాగా జరగకూడదని రాజు వాపోయాడు. ఈ ఘటనపై క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్‌తో కలిసి.. చర్చించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రాజు చెబుతున్నాడు.


సోషల్ మీడియా వేదికగా టోల్‌గేట్ దగ్గర కట్టిన డబ్బులు తాలూకు రిసిప్ట్స్‌, ముమైత్‌తో కలిసిన దిగిన ఫొటోలు, ఆమెతో చేసిన వాట్సాప్ చాట్‌ను రాజు షేర్ చేశాడు. ముమైత్ తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇంతవరకూ ముమైత్ మాత్రం కనీసం సోషల్ మీడియాలో కూడా స్పందిచలేదు.

Updated Date - 2020-09-29T23:44:02+05:30 IST