పెళ్లికి నిరాకరించిన నటిపై దాడి చేసిన ఫేస్‌బుక్ ఫ్రెండ్

ABN , First Publish Date - 2020-10-27T22:04:06+05:30 IST

పెళ్లికి నిరాకరించిన టీవీ నటిపై ఆమె ఫేస్‌బుక్ స్నేహితుడు ఒకరు కత్తితో దాడి చేశాడు. నగరంలోని వెర్సోవాలో ఉన్న ఫిషరీస్ యూనివర్సిటీ రోడ్డులో ఈ ఘటన జరిగింది.

పెళ్లికి నిరాకరించిన నటిపై దాడి చేసిన ఫేస్‌బుక్ ఫ్రెండ్

ముంబై: పెళ్లికి నిరాకరించిన నటిపై ఆమె ఫేస్‌బుక్ స్నేహితుడు ఒకరు కత్తితో దాడి చేశాడు. నగరంలోని వెర్సోవాలో ఉన్న ఫిషరీస్ యూనివర్సిటీ రోడ్డులో ఈ ఘటన జరిగింది. పోలీసులకు మాల్వీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టీవీ నటి మాల్వీ మల్హోత్రా, కుమార్ మహిపాల్ సింగ్ ఫేస్ బుక్ స్నేహితులు. ఆమెకు 2019లో పరిచయం అయ్యాడు. తనను తాను సినీ నిర్మాతగా పరిచయం చేసుకున్నాడు. వీరిద్ద మధ్య కొన్ని చర్చలు కూడా జరిగాయి. అయితే తనతో డేటింగ్‌కు రావాలని, పెళ్లి చేసుకోవాలని మహిపాల్ సతాయించడం మొదలుపెట్టాడు. దీంతో అతన్ని మాల్వీ దూరం పెట్టింది. ఇది సహించలేని మహిపాల్..  సోమవారం రాత్రి దాడి జరిపాడు. యూనివర్సిటీ రోడ్డులో వస్తున్న ఆమెకు అడ్డుపడి... కత్తితో కడుపులో, చేతిపై దాడి చేసి అక్కడి నుంచి తన ఆడి కారులో పరారయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా... అక్కడికి చేరుకుని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.


ప్రస్తుతం ఆమె ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. 


ఉడాన్ టీవీ షో.. అలాగే హోటల్ మిలాన్ సినిమాలో మాల్వీ నటించింది. గత ఆదివారం దుబాయ్‌లో షూటింగ్ ముగించుకుని... ఇండియాకు చేరింది. అయితే అంతలోనే ఆమెపై దాడి జరిగింది. 

Updated Date - 2020-10-27T22:04:06+05:30 IST