నటుడు యాదాకృష్ణ ఆకస్మిక మరణం

ABN , First Publish Date - 2020-12-03T05:44:31+05:30 IST

పాతికేళ్ల క్రితమే ‘తెలంగాణ హీరో’గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, నిర్మాత యాదాకృష్ణ..

నటుడు యాదాకృష్ణ ఆకస్మిక మరణం

పాతికేళ్ల క్రితమే ‘తెలంగాణ హీరో’గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, నిర్మాత యాదాకృష్ణ (61) బుధవారం ఉదయం హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించారు. జేఎన్‌టీయూలో ఉద్యోగిగా పనిచేస్తూ పదవీ విరమణ చేసిన యాదాకృష్ణకు మొదటినుంచీ సినిమాలంటే ఆసక్తి. ఒకపక్క ఉద్యోగం చేస్తూనే టీవీ సీరియల్స్‌లో ,  సినిమాల్లో నటిస్తుండేవారు. ‘శృంగార పురుషుడు’, ‘ఇరుకింట్లో ఇద్దరు పెళ్లాలు’ సహా  ఇరవై చిత్రాల్లో ఆయన హీరోగా నటించారు. ఆయన చివరి చిత్రం ‘సంక్రాంతి అల్లుడు’. ఆ తర్వాత మరో కొత్త చిత్రం నిర్మించాలని ఇటీవలే  సన్నాహాలు ప్రారంభించారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - 2020-12-03T05:44:31+05:30 IST