మహిళపై లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడి అరెస్ట్

ABN , First Publish Date - 2020-11-04T11:07:27+05:30 IST

ఓ మహిళను లైంగికంగా వేధించిన కేసులో నటుడు విజయ్ రాజ్‌ను మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు....

మహిళపై లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడి అరెస్ట్

బెయిలుపై విడుదల 

గోండియా (మధ్యప్రదేశ్): ఓ మహిళను లైంగికంగా వేధించిన కేసులో నటుడు విజయ్ రాజ్‌ను మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర బాలాఘాట్, గోండియాలోని హోటల్ గేట్ వే లో ఓ చిత్రం షూటింగు సందర్భంగా నటుడు తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నటుడు విజయ్ రాజ్‌ను అరెస్టు చేసి గోండియాలోని స్థానిక కోర్టులో హాజరుపర్చగా కోర్టు జడ్జి ఆయనకు బెయిలు మంజూరు చేశారు.విజయరాజ్ ఇతర యూనిట్ సభ్యులతో కలిసి గోండియాలో షెర్ని చిత్రం షూటింగు జరుగుతుండగా ఈ లైంగికవేధింపుల ఘటన చోటుచేసుకుంది. 


చిత్ర యూనిట్ లో పనిచేస్తున్న 30 ఏళ్ల మహిళ తనను విజయ్ రాజ్ లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసింది.దీంతో పోలీసులు విజయ్ రాజ్ పై ఐపీసీ సెక్షన్ 354 ఎ, డి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.విజయ్ రాజ్ 1999 లో విడుదలైన 'భోపాల్ ఎక్స్‌ప్రెస్'లో తొలిసారిగా నటించారు. 'జంగిల్', 'మాన్‌సూన్ వెడ్డింగ్', 'ఆక్సు', 'కంపెనీ', 'లాల్ సలాం', 'రోడ్', 'రన్', 'ధమాల్', 'డ్రీమ్ గర్ల్', 'గల్లీ బాయ్' వంటి సినిమాల్లో ఈయన నటించారు.  వెబ్ సిరీస్‌లో నటించాడు. అతను చివరిసారిగా 'గులాబో సీతాబో' సినిమాలో కనిపించారు.

Updated Date - 2020-11-04T11:07:27+05:30 IST

Read more