అలాంటిదేమీ లేదు.. ఆడదానిగా ఆ మాత్రం తెలీదా..: దిల్ బెచారా నటి

ABN , First Publish Date - 2020-07-28T03:03:23+05:30 IST

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు నటి స్వస్తిక ముఖర్జీ అండగా నిలిచారు. సుశాంత్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తనకెప్పుడూ అనిపించలేదని తెలిపారు. సుశాంత్ చివరి సినిమా దిల్ బెచారాలో..

అలాంటిదేమీ లేదు.. ఆడదానిగా ఆ మాత్రం తెలీదా..: దిల్ బెచారా నటి

ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు నటి స్వస్తిక ముఖర్జీ అండగా నిలిచారు. సుశాంత్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తనకెప్పుడూ అనిపించలేదని తెలిపారు. సుశాంత్ చివరి సినిమా దిల్ బెచారాలో హీరోయిన్ గా నటించిన సంజన సాంఘిని సుశాంత్  లైంగికంగా వేధించాడంటూ 2018లో అనేక పుకార్లు వచ్చాయి. సుశాంత్ తో పాటు దర్శకుడు ముఖేష్ చాబ్రాపై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ చిత్రంలో సంజన తల్లి పాత్ర పోషించిన స్వస్తిక ముఖర్జీ సుశాంత్ కు అండగా నిలిచారు. సుశాంత్, సంజనల మధ్య ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినట్లు తనకెప్పుడూ అనిపించలేదని ఆమె అన్నారు. 'సుశాంత్-సంజనలు ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు. ఒకవేళ సంజనను సుశాంత్ లైంగిక వేధింపులకు గురిచేసి ఉంటే నాకు కచ్చితంగా తెలిసేది. ఓ మహిళగా ఆ మాత్రం అర్ధం చేసుకోగలను. కానీ నాకెప్పుడూ అలాంటి పరిస్థితులు కనపడలేద'ని ముఖర్జీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఆ పుకార్లపై సంజన కూడా ఇంతకుముందే స్పందించారు. సుశాంత్, ముఖేష్ లపై వచ్చిన ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశారు.

Updated Date - 2020-07-28T03:03:23+05:30 IST