చిరంజీవి గొప్పతనం చెబుతూ కన్నీరు పెట్టుకున్న నటుడు

ABN , First Publish Date - 2020-05-11T04:49:17+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం, ఆయన గొప్పమనసు గురించి ఇప్పటికే ఎన్నో కథనాలు విన్నాం. ఇప్పుడు సిసిసి రూపంలో చూస్తున్నాం. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే

చిరంజీవి గొప్పతనం చెబుతూ కన్నీరు పెట్టుకున్న నటుడు

మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం, ఆయన గొప్పమనసు గురించి ఇప్పటికే ఎన్నో కథనాలు విన్నాం. ఇప్పుడు సిసిసి రూపంలో చూస్తున్నాం. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే చాలు వెంటనే కరిగిపోయే మనసు చిరంజీవిది. అలాగే తనకు ఆపద కలిగించాలని చూసిన వారిపై కూడా చిరు ప్రేమ కురిపిస్తాడు. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. అయితే నటుడు శరత్ కుమార్ తన తాజా ఇంటర్వ్యూలో చిరంజీవి గొప్పతనం గురించి చెబుతూ ఉద్వేగానికి లోనయ్యారు. చిరంజీవి గురించి చెబుతూ శరత్ కుమార్ అతను చేసిన సహాయాన్ని తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 


శరత్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘నేను ఒకానొక టైమ్‌లో బాగా డౌన్ ఫాల్ అయ్యాను. అప్పులు కూడా బాగా పెరిగిపోయాయి. ఆ సమయంలో ఒక నిర్మాత నా దగ్గరకు వచ్చి చిరంజీవిగారి డేట్స్ పట్టుకొస్తే.. ఆయనతో సినిమా తీసి వచ్చిన లాభాలతో మీ అప్పులు తీర్చుకునేలా నేను సహాయం చేస్తానని చెప్పారు. అప్పుడు నాకు వేరే దారి లేదు. వెంటనే చిరంజీవిగారికి ఫోన్ చేసి మీతో పర్సనల్‌గా మాట్లాడాలని అన్నాను. వెంటనే ఆయన ఇంటికి రమ్మన్నారు. నేను వెళ్లాను. అప్పుడు ఓ ఫైట్ షూటింగ్‌లో ఉన్న తను.. ఆ చిత్ర దర్శకనిర్మాతలను పిలిచి మళ్లీ ఈ షూట్ పెట్టుకుందాం.. శరత్ వచ్చాడు మాట్లాడాలి అని వచ్చేశారు. 

నాకు ప్రేమగా వడ్డించి, భోజనం చేసిన తర్వాత విషయం ఏమిటో చెప్పమని అడిగారు. నీ డేట్స్ కావాలని చెప్పి.. ఆ నిర్మాత చెప్పినది చెప్పా. వెంటనే ఆయన ప్రస్తుతం నేను చేస్తున్న సినిమా అవ్వగానే నీకే డేట్స్ ఇస్తాను. అన్ని ఏర్పాట్లు చేసుకో అని అన్నారు. మరి రెమ్యూనరేషన్ ఎంత ఇవ్వమంటావ్? అని అడిగాను. (ఇక్కడే శరత్ ‌కుమార్‌కు మాట రాలేదు. కన్నీళ్లు పెట్టుకున్నారు. కాసేపటి తర్వాత మాట్లాడుతూ..) నువ్వు నాకు రెమ్యూనరేషన్ ఇస్తావారా? అని ఫైర్ అయ్యారు. నువ్వే చెప్పావుగా కష్టాల్లో ఉన్నానని.. నాకు రెమ్యూనరేషన్ వద్దు.. నీకు డేట్స్ ఇస్తున్నాను.. అంతే.. అని చెప్పి నన్ను పంపించారు..’’ అని శరత్ కుమార్ తెలిపారు. శరత్ కుమార్ ఈ విషయం తెలుపుతున్నప్పుడు పక్కన ఆయన భార్య రాధిక కూడా ఉన్నారు. 

Updated Date - 2020-05-11T04:49:17+05:30 IST