రాథేశ్యామ్‌ స్టోరీ లైన్‌ అదేనా..? అసలు విషయం చెప్పిన సచిన్‌!

ABN , First Publish Date - 2020-10-27T19:11:14+05:30 IST

బాహుబలి వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమా.. తరువాత సాహో లాంటి ఛాలెంజింగ్‌ మూవీ.. త్వరలో రాథేశ్యామ్‌. రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ వరుస పాన్‌ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాథేశ్యామ్‌ మరికొద్ది రోజుల్లో..

రాథేశ్యామ్‌ స్టోరీ లైన్‌ అదేనా..? అసలు విషయం చెప్పిన సచిన్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాహుబలి వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమా.. తరువాత సాహో లాంటి ఛాలెంజింగ్‌ మూవీ.. త్వరలో రాథేశ్యామ్‌. రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ వరుస పాన్‌ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాథేశ్యామ్‌ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్‌ లుక్‌ అభిమానులకు తెగ నచ్చేసింది. అతడి సరసన బుట్టబొమ్మ పూజ హెగ్డే కూడా అదే స్థాయిలో మెరిసిపోతోంది. వరుసగా విడుదలవుతున్న రాథేశ్యామ్‌ మోషన్‌ పోస్టర్లు, ఫోటోలు సినిమాపై భారీగా అంచనాలను పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సచిన్‌ కేడ్కర్‌ రాథేశ్యామ్‌ స్టోరీలైన్‌ను బయటపెట్టేశారు. ఈ కథ జ్యోతిష్యానికి, సైన్స్‌కు మధ్య కొనసాగే కథని, అదే ఈ సినిమా కన్సెప్ట్‌ అని అసలు విషయం రివియల్‌ చేసేశారు. ఈ సినిమాలో తాను ఒక డాక్టర్‌ పాత్రలో కనిపించనున్నట్లు చెప్పారు.


ప్రభాస్‌ భవిష్యత్తు పట్ల చాలా స్పష్టమైన ఆలోచనలు ఉన్న ఒక వ్యక్తిగా ఈ సినిమాలో కనిపిస్తారని, ఆయన పాత్ర ఆసక్తికరంగా సాగుతుందని సచిన్‌ చెప్పుకొచ్చారు. డైరెక్టర్‌ రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా  తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్రం కూడా మునుపటి చిత్రాల్లాగే ప్రభాస్‌కు మంచి బ్రేక్‌ ఇస్తుందా..? ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది..? అనే విషయాలు మాత్రం సినిమా విడుదలైన తరువాత కానీ తెలియదు.

Updated Date - 2020-10-27T19:11:14+05:30 IST