నెపోటిజంపై ప్ర‌కాశ్ రాజ్ కీల‌క వ్యాఖ్య‌లు

ABN , First Publish Date - 2020-06-16T22:03:23+05:30 IST

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజంపై ఏ రేంజ్‌లో చర్చలు జరుగుతున్నాయో తెలిసిందే. సినీ పరిశ్రమలో ఎక్కువగా నటవారసత్వంకు

నెపోటిజంపై ప్ర‌కాశ్ రాజ్ కీల‌క వ్యాఖ్య‌లు

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజంపై ఏ రేంజ్‌లో చర్చలు జరుగుతున్నాయో తెలిసిందే. సినీ పరిశ్రమలో ఎక్కువగా నటవారసత్వంకు ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్లే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వంటి నటీనటులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటూ కాస్త ఘాటుగానే సోషల్ మీడియాలో నెటిజన్లు, అలాగే కొందరు నటీనటులు వాపోతున్నారు. తాజాగా నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఈ నెపోటిజంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 


గతంలో సుశాంత్ సింగ్ సింగ్ నెపోటిజంపై మాట్లాడిన వీడియోని షేర్ చేసిన ప్రకాశ్ రాజ్.. ‘‘నేను ఎన్నో గాయాలను తట్టుకొని ఇక్కడ నిలబడ్డాను. కానీ అది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వల్ల కాలేదు. నెపోటిజం నుంచి నేను బయపపడ్డాను. నా గాయాలు నా మాంసం కన్నాలోతుగా ఉన్నాయి. అయినా తట్టుకో గలిగాను. ఇప్పటికైనా నేర్చుకుందాం. వారు కన్న కలలు చనిపోనీవ్వకుండా నిలబడదాం..’’ అంటూ ప్రకాశ్ రాజ్ ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు.   Updated Date - 2020-06-16T22:03:23+05:30 IST