మల్లూవుడ్‌లో విషాదం.. క్రిస్మస్ స్టార్ కట్టేందుకు చెట్టెక్కి..

ABN , First Publish Date - 2020-12-21T22:52:07+05:30 IST

‘ప్రేమమ్‌’ నటుడు నివిన్ పాలి పర్సనల్ మేకప్‌మెన్, షాబు పుల్పల్లి(37) ప్రమావశాత్తూ చెట్టుపై నుంచి కిందపడి మరణించాడు. క్రిస్మస్ స్టార్ కట్టేందుకు...

మల్లూవుడ్‌లో విషాదం.. క్రిస్మస్ స్టార్ కట్టేందుకు చెట్టెక్కి..

చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తూ కింద పడి ‘ప్రేమమ్’ నటుడు నివిన్ పాలి మేకప్‌మెన్ దుర్మరణం

‘ప్రేమమ్‌’ నటుడు నివిన్ పాలి పర్సనల్ మేకప్‌మెన్, షాబు పుల్పల్లి(37) ప్రమావశాత్తూ చెట్టుపై నుంచి కిందపడి మరణించాడు. క్రిస్మస్ స్టార్ కట్టేందుకు చెట్టుపైకి ఎక్కిన షాబు ప్రమాదవశాత్తూ కాలు జారి కిందపడ్డాడు. ఎత్తు నుంచి కిందపడటంతో తీవ్ర గాయాలపాలైన షాబును ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. షాబు 2012 నుంచి నివిన్ పాలి పర్సనల్ మేకప్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. మల్లూవుడ్‌లోని ప్రముఖులందరితో షాబుకు మంచి సంబంధాలున్నాయి.


షాబు అకాల మృతిపై ఫెఫ్కా(ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) సంతాపం తెలిపింది. ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా షాబు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. బెంగళూరు డేస్, విక్రమాదిత్యన్ సినిమాల సమయంలో షాబుతో కలిసి పనిచేసిన రోజులను మర్చిపోలేనని దుల్కర్ గుర్తుచేసుకున్నాడు.

Updated Date - 2020-12-21T22:52:07+05:30 IST