బాగా దగ్గరగా బతికిన రోజుల్లో..: బ్రహ్మాజీ

ABN , First Publish Date - 2020-05-11T15:52:51+05:30 IST

ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే సినీ ప్రముఖులందరూ లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు.

బాగా దగ్గరగా బతికిన రోజుల్లో..:  బ్రహ్మాజీ

ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే సినీ ప్రముఖులందరూ లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. 50 రోజులుగా ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండిపోయారు. ఒకవేళ లాక్‌డౌన్ ఎత్తేసినా ఇంతకుముందులా భయం లేకుండా కలిసి తిరిగే అవకాశం కనిపించడం లేదు.  


ఈ నేపథ్యంలో `బాగా దగ్గరగా బతికిన రోజుల్లో..` అంటూ నటుడు బ్రహ్మాజీ ఓ ఫొటోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. హీరో రవితేజ, నటుడు సుబ్బరాజు, డైరెక్టర్లు హరీశ్‌ శంకర్‌, మెహర్‌ రమేష్‌, బీవీఎస్‌ రవిలతో కలిసి పార్టీ చేసుకున్నప్పటి ఫొటోను పోస్ట్ చేశాడు. అలాగే `అతికిన రోజుల్లో..` అంటూ `సర్దార్ గబ్బర్‌సింగ్` షూటింగ్ సందర్భంగా పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్, సాయిధరమ్ తేజ్, అలీ, నర్రా శ్రీనివాస్, నిర్మాత శరత్ మరార్‌లతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. 
Updated Date - 2020-05-11T15:52:51+05:30 IST