నా పేరుతో నకిలీ ట్విటర్‌ ఖాతా..

ABN , First Publish Date - 2020-07-19T09:35:23+05:30 IST

తన పేరుతో నకిలీ ట్విటర్‌ ఖాతాను తెరిచారని సినీ నటుడు అలీ ఆరోపించారు. ఈ మేరకు...

నా పేరుతో నకిలీ ట్విటర్‌ ఖాతా..

  • పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీ నటుడు అలీ

హైదరాబాద్‌ సిటీ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): తన పేరుతో నకిలీ ట్విటర్‌ ఖాతాను తెరిచారని సినీ నటుడు అలీ ఆరోపించారు. ఈ మేరకు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘అలీ అఫిషియల్‌’ పేరుతో కొందరు ట్విటర్‌లో ఖాతా తెరవడంతోపాటు సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది హీరోలను, నటీనటుల్ని అభినందిస్తున్నట్లు పోస్టులు పెట్టి ట్వీట్‌ చేస్తున్నారని అలీ పేర్కొన్నారు. దీంతో ఆ ట్వీట్‌లు తానే చేశానని భావించి కథనాలు వస్తున్నాయన్నారు. ఈ నకిలీ ఖాతా సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని అలీ స్వయంగా శనివారం సైబరాబాద్‌ క్రైం డీసీపీ రోహిణి ప్రియదర్శినిని కలిసి ఫిర్యాదు అందజేశారు. 

Updated Date - 2020-07-19T09:35:23+05:30 IST