ముంబైలోని ఫ్లాట్ లో టీవీ నటుడు అక్షత్ ఉత్కర్ష్ ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-09-29T22:40:40+05:30 IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి తరహాలోనే ముంబైలో...

ముంబైలోని ఫ్లాట్ లో టీవీ నటుడు అక్షత్ ఉత్కర్ష్ ఆత్మహత్య

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి తరహాలోనే ముంబైలో మరో యువ నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బీహార్ కు చెందిన 26 ఏళ్ల టీవీ నటుడు అక్షత్ ఉత్కర్ష్ ముంబైలోని అద్దె ఫ్లాట్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లాక్ డౌన్ కారణంగా గత కొంత కాలంగా షూటింగ్ లు నిలిచిపోవడంతో ఉత్కర్ష్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడని, ఆ ఒత్తిడిని తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడ్డాడని అంబోలీ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే.. ఉత్కర్ష్ మానసిక ఒత్తిడికి లోనయి చనిపోలేదని, అతనిని హత్య చేసి చంపేశారని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు పోస్ట్ మార్టం అనంతరం అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.


ఉత్కర్ష్ తన ఫ్లాట్ లో ఓ లేడీ ఫ్రెండ్ తో కలిసి ఉంటున్నాడని, ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి 11.30 గంటలకు ఆమె వాష్ రూమ్ కు వెళ్లిన సమయంలో.. ఉత్కర్ష్ చనిపోయినట్లు గమనించి తమకు సమాచారం అందించినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.Updated Date - 2020-09-29T22:40:40+05:30 IST